కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రాధాన్యం ఇచ్చే రోహిత్ నారా, కరణ్ సి ప్రొడక్షన్స్ LLPతో తన తదుపరి ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ బ్యానర్ లో ప్రతిష్టాత్మకమైన 5వ ప్రొడక్షన్ గా రూపొందుతున్న #RN23 కంప్లీట్ రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ ప్రాజెక్ట్‌ను భరత్ చౌదరి నిర్మిస్తుండగా, చినిమిల్లి మణికుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆయనే కథ, స్క్రీన్‌ప్లే కూడా అందిస్తున్నారు. యూనివర్సల్ ఎమోషన్స్‌తో కూడిన కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది.
“షౌటింగ్ సూన్” అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో ఉన్న అనౌన్స్మెంట్ పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా హాస్యం, ప్రేమ, భావోద్వేగాలు, కుటుంబ అనుబంధాలను కలగలిపిన వినోదాత్మక కథతో ఈ సినిమా రాబోతోంది.
త్వరలోనే ముహూర్తం వేడుకతో చిత్ర నిర్మాతలు ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.
ఇతర నటీనటులు, సాంకేతిక బృందం రెగ్యులర్ షూటింగ్ షెడ్యూల్‌కు సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
నటీనటులు: రోహిత్ నారా
| విభాగం | వివరాలు |
|---|---|
| నటీనటులు | రోహిత్ నారా |
| నిర్మాణ సంస్థ | కరణ్ సి ప్రొడక్షన్స్ LLP |
| నిర్మాత | భరత్ చౌదరి |
| కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం | చినిమిల్లి మణికుమార్ |
| PRO | వంశీ శేఖర్ |
| మార్కెటింగ్ | హాష్‌ట్యాగ్ మీడియా |

















Comments (0)