యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా ‘గోదారి గట్టుపైన’తో అలరించబోతున్నారు. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. నిధి ప్రదీప్ ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. టీజర్, ట్రైలర్ పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రం మే 8న వరల్డ్‌వైడ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్మాత అభినవ్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
మీ నేపథ్యం గురించి?
-నేను 10 ఏళ్లుగా విభిన్నమైన వ్యాపారాల్లో ఉన్నాను. నాకు సినిమా అంటే ప్యాషన్ ఉంది. మంచి స్క్రిప్ట్ కోసం చూస్తున్న సమయంలో సుభాష్ గారు చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. నేను యూనివర్సల్‌గా అందరికీ కనెక్ట్ అయ్యే ఎమోషన్స్‌తో కథ చేయాలని అనుకున్నాను. అలాంటి కథ ఈ సినిమాతో కుదిరింది.
మీ తొలి సినిమా నిర్మాణ ప్రయాణం ఎలా అనిపించింది?
చాలా బాగుంది. టఫ్‌గా ఉంది. ఏ పరిశ్రమలో అయినా టఫ్ ఉంటేనే బాగుంటుంది. నా వరకు ఏదైనా టఫ్‌గా ఉంటేనే చేయాలనిపిస్తుంది.
టైటిల్ ఛాయిస్ ఎవరిది?
రెండు మూడు టైటిల్స్ అనుకున్నాం. అయితే నేటివిటీకి ఈ టైటిల్ చాలా దగ్గరగా అనిపించింది. నేను సజెస్ట్ చేశాను. డైరెక్టర్ గారికి కూడా నచ్చింది. అలాగే యూనివర్సల్‌గా అందరికీ కనెక్ట్ అయ్యే టైటిల్ కావడంతో ‘గోదారి గట్టుపైన’ పేరుని ఫైనల్ చేశాం.
పక్కా తెలంగాణ మాట్లాడే సుమంత్ ప్రభాస్‌ను ఈ సినిమాకి ఎంపిక చేయడానికి కారణం?
ఒక నటుడు ఛాలెంజ్ ఉన్న పాత్ర చేయాలని కోరుకుంటాడు. తెలంగాణలో చేయడం అతనికి ఈజీ. కానీ ఈ పాత్ర కోసం గోదారి యాసను పర్ఫెక్ట్గా నేర్చుకుని, ఛాలెంజ్‌గా తీసుకుని చేశాడు. టఫ్‌గా తీసుకున్నప్పుడే యాక్టర్‌గా సంతృప్తి ఉంటుంది. ఈ సినిమాలో చాలా అద్భుతంగా చేశాడు. ఈ సినిమాను అందరూ సమానంగా ఆదరిస్తారు.
డైరెక్టర్ సుభాష్ గురించి?
ఈ సినిమా చేసే ముందు దాదాపు పది కథలు విన్నాను. సుభాష్ గారు చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. ఆయన డైరెక్టర్‌గా కూడా నాకు చాలా ఇష్టం. చాలా డెడికేషన్‌తో పనిచేస్తారు. ఆయనకి సినిమా తప్ప మరో ధ్యాస ఉండదు.
సుభాష్ టెక్నికల్‌గా చాలా స్ట్రాంగ్. నాకు ప్రతిదీ పేపర్ మీద ఉండాలి. ఆయన షూటింగ్‌కు సంబంధించిన ప్రతి విషయాన్ని ఫ్రేమ్‌తో సహా పేపర్ మీద చూపించారు. ప్రతిదీ డీటెయిల్‌గా ప్లాన్ చేశారు. సినిమా షూటింగ్ అంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరిగింది.
సునీల్ నారంగ్ గారి గురించి?
-సునీల్ గారు నాకు శ్రేయోభిలాషి, మార్గదర్శి. ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తారు. జగపతి బాబు గారు, లైలా గారు, రాజీవ్ కనకాల గారు వంటి అనుభవం ఉన్న నటీనటులు నా తొలి సినిమాకే పని చేసే అవకాశం దొరికిందంటే.. కారణం సునీల్ గారి ప్రోత్సాహం.
-సినిమాను సీడెడ్‌లో తిరుపతి ప్రసాద్ గారు, నైజాంలో నేను మరియు సునీల్ గారు, ఆంధ్రలో సురేష్ బాబు గారు రిలీజ్ చేస్తున్నారు. 7వ తేదీ సాయంత్రం ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నాం. సినిమా చాలా మంచి క్వాలిటీతో వచ్చింది. ఆడియన్స్‌కు బెస్ట్ ప్రొడక్ట్ ఇస్తున్నాం.
హీరోయిన్ నిధి గురించి
-డైరెక్టర్ సుభాష్ రాసుకున్న క్యారెక్టర్‌కు నిధి పర్ఫెక్ట్గా సరిపోయింది. జగపతి బాబు గారితో నిధి మధ్య చాలా మంచి ఎమోషన్స్ ఉంటాయి.
-కథలో ఎమోషన్స్ రాసిన విధానం, తీసిన విధానం చాలా పెక్యులర్‌గా ఉంటాయి. థియేటర్స్‌లో ఎంజాయ్ చేసే మంచి అనుభవం ఇస్తుంది. ఎమోషన్స్, కామెడీ, డ్రామా అన్నీ అద్భుతంగా బ్లెండ్ అయ్యాయి.
మ్యూజిక్ గురించి?
వంశీ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. కథ, ఎమోషన్స్‌ను మ్యూజిక్ బాగా ఎలివేట్ చేస్తుంది.
మీకు ఇష్టమైన జోనర్ ఏమిటి? ఎలాంటి సినిమాలు చేయాలని భావిస్తున్నారు?
-నాకు అన్ని జానర్స్ ఇష్టం. థియేటర్లో ఆడియన్స్‌ను ఎంగేజ్ చేసే కథలని ప్రొడ్యూస్ చేయాలని భావిస్తున్నాను.
-ఈ సినిమా విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాను. మేము అనుకున్న కథను అద్భుతంగా వచ్చింది.

















Comments (0)