Skip to content

జులై 31న ప్రేక్షకుల ముందుకు ‘అమ్మా… నాకు ఆ అబ్బాయి కావాలి’

జిఎస్ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై పవన్ మహావీర్ ను హీరోగా పరిచయం చేస్తూ… ప్రముఖ మహిళా వ్యాపారవేత్త శైలజ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న విభిన్న ప్రేమకధా చిత్రం “అమ్మా… నాకు ఆ అబ్బాయి కావాలి”. శివాల ప్రభాకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వర్షిక, సుహానా హీరోయిన్లు. సుమన్, రావు రమేష్, రాజీవ్ కనకాల, సత్యకృష్ణ, సుజాత తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 31 విడుదలకు సిద్ధమవుతోంది!!

నిర్మాత జి. శైలజరెడ్డి మాట్లాడుతూ… “అమ్మా… నాకు ఆ అబ్బాయి కావాలి” చిత్రం ఒకటికి రెండుసార్లు చూడాలనిపించేలా తెరకెక్కింది. అందుకు సహకరించిన సాంకేతిక నిపుణులకు, నటీనటులకు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. హీరోగా పవన్ మహావీర్ కు ఉజ్వల భవిష్యత్తు ఉందని వివిధ దశల్లో సినిమా చూసినవాళ్ళంతా చెబుతుంటే గర్వంతో మనసు ఉప్పొంగిపోతోంది. ఈనెల 31న విడుదల చేసెందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం” అని అన్నారు!!

Back To Top